AP Police Jobs: ఏపీలో 6511 పోలీస్‌ ఉద్యోగాలు నోటిఫికేషన్‌ విడుదల… ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలివే || AP POLICE CONSTABLE NOTIFICATION RELEASED 2022

Hyderabad: Andhra DGP at AP Police Duty Meet #Gallery - Social News XYZ

 

 

 

AP Police Notification 2022: మొదటి దశ కింద ఈ ఏడాది 6,100 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ను ఖరారు చేసింది. డిసెంబర్‌ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనుంది.

AP Police Recruitment 2022 :ఏపీ ప్రభుత్వం పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసు శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది.

మొదటి దశ కింద ఈ ఏడాది 6,100 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ను ఖరారు చేసింది. డిసెంబర్‌ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2023 ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించనుంది. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

పోలీసు నోటిఫికేషన్‌ పోస్టుల వివరాలు ఇవే:

 

  • ఎస్సై (సివిల్‌)- 315 పోస్టులు
  • ఎస్సై (ఏపీఎస్పీ) – 96 పోస్టులు
  • పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్‌) – 3,580 పోస్టులు
  • ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ (ఏఆర్‌ బెటాలియన్‌) – 2,520 పోస్టులు

పూర్తి నోటిఫికేషన్ PDF కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  : AP POLICE NOTIFICATION 2022 

AP Jobs : ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 560 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌
Anganwadi Supervisor posts : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ.. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పోస్టుల భర్తీపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 560 అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీకానున్నాయి.

 

APPLY ONLINE LINK HERE : AP POLICE ONLIE LINK

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతి ఇవ్వడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో.. బుధవారం విచారణ కొనసాగగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీపై స్టే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఇదిలా ఉంటే.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఆమధ్య ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Telangana Anganwadi workers - Unsung Heroes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *